Posts

Showing posts from March, 2025

Letter to Jilukara SRinivas - On Hindi and Sanskrit

Image
మిత్రమా జిలుకర శ్రీనివాస్! విజయవాడ 03-03-2025    మిత్రమా జిలుకర శ్రీనివాస్! సామాజిక ఉద్యమ అభివందనలతో,    నువ్వు బాగున్నావని ఆశిస్తాను.  నేను మొత్తమ్మీద బాగున్నాను.                నాకు ఓ ఇరవైయేళ్ళుగా జీవనశైలి రోగాలని అందంగా పిలుచుకునే డయాబెటీస్ వుంది. దాన్ని గుర్తు పట్టే సమయానికే రెటినోపతి వచ్చేసింది. కొండల్లో అతిగా తిరిగి హిప్ జాయింట్స్ రీ-ప్లేస్మెంటుకు వచ్చాయి. ఆరోగ్యాన్ని  జాగ్రత్తగా  మెనేజ్ చేస్తున్నాను.              నువ్వు క్రమంగా యాక్టివ్ పొలిటిషియన్ గా మారుతున్నట్టున్నావు. మంచిది. సంఘపరివారం తన సోషల్ బేస్ ను బాగా విస్తరించుకుంది. గతంలోలా అగ్రవర్ణాలు, ఓసి సామాజికవర్గాలకే అది పరిమితమైలేదు. ఎన్నికల్లో గెలవడానికీ, కాల్బలంగా ఉపయోగించుకోవడానికి దానికిప్పుడు బహుజన సామాజికవర్గాలు కావాలి.  బిసిలు, ఎస్సీలు, ఎస్టీలను తనవైపుకు చాలా వేగంగా లాక్కుంటున్నది. రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా చీలికల్లో ఒకటి ఇప్పుడు ఎన్డీయేలో భాగస్వామిగా వుంటున్నది. దాని నాయకుడు రామదాస్ అథవాలే గత మూడు కేబిన...